Wednesday, December 25, 2024

స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక అతిథులుగా లాఖ్‌పతి, డ్రోన్‌దీదీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎర్రకోటలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 78వ స్వాతంత్య్ర వేడుకలకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారిలో కొందరిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తోంది. పంచాయతీరాజ్ సంస్థల నుంచి దాదాపు 400 మంది మహిళా ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే 45 మంది లాఖ్‌పతి దీదీలు, 30 మంది డ్రోన్ దీదీలు హాజరవుతారు.

వీరికోసం బుధవారం ప్రత్యేకంగా జాతీయ వర్క్‌షాపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, నవజ్యోతి ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కిరణ్ భేడీతోపాటు పలు శాఖల అధికారులు పాల్గోనున్నారు. స్వయం సహాయక సంఘ్ (ఎస్‌హెచ్‌జీ) కింద మహిళలకు వివిధ రకాల నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి వారు ఏడాదికి కనీసం రూ. లక్ష స్థిర ఆదాయం పొందడమే లాఖ్‌పతి దీదీ పథకం. ఎస్‌హెచ్‌జీ ల్లోని మహిళలకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇవ్వడమే డ్రోన్ దీదీ పథకం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News