సిటీబ్యూరో: విద్యార్థి దశలోనే లక్షాలను నిర్ధేశించుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆర్టిసి ఎండి విసి సజ్జనార్ అన్నా రు. హైదరాబాద్, సుచిత్రలోని కమ్యూనిటీ హా ల్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమం లో పదోతరగతి, ఇంటర్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీసోమవంశ సహస్జ్రున క్షత్రియ పట్కార్ ప్రాంతీయ సమాజ్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్టిసి ఎండి విసి సజ్జనార్ మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదుల్లో అభ్యాసంతోపాటు క్షేత్రస్థాయి లో వివిధ అంశాలను పరిశీలించి నైపుణ్యాలు సాధించాలని సూచించారు.
ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, వాటిపై పట్టు పెంచుకుంటేనే భవిష్యత్ ఉంటుందని, ఉపాధి అవకాలు లభిస్తాయని అన్నారు. సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు కనుగొనాలని కోరారు. క్షత్రియ ప్రాంతీయ సమాజ్ అధ్యక్షుడు, ఆర్టిసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ విశ్వనా థ్ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులు సివిల్స్ లక్షంగా కష్టపడి చదవాలిని కోరారు. విద్యార్థులు,యువకులు సమాజ్ కల్చర్‌ను అనుసరించాలని మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథం అన్నారు.
తల్లిదండ్రులు విద్యార్థులను ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాలని అఖిల భారత క్షత్రియ సమాజ్ ఉపాధ్యాక్షుడు విశ్వనాథ్ బాలకిషన్ అన్నారు. ఉత్తమ విద్యార్థులకు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా ఘనసన్మానం చేశారు. సమాజ్ కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న పలువురిని సమాజ్ సేవా పురస్కార్‌తో సన్మానం చేశారు. కార్యక్రమంలో రాంకిషన్ రావు, విశ్వనాథ్ అశోక్, పూజారి రాజేశ్వర్, మామిడి పెంటూసా, గుజరాతి రాజేశ్వర్, దినేష్ వైద్య, శాందేశ్ శ్రీనివాస్, ఆనంద్ మేగ్జి, సంతోష్, రాజీవ్ నామాజి, భరత్ చవాన్, రతన్ నెహ్రూ, పండిత ప్రేమ్, రాజ్‌కుమార్,డాక్టర్ ఎల్లమ్మ బాయి, దొండి మీనాక్షి, టంక్ కస్తూరి, దీపారాణి, సీత అనిత, శింపండిత్, జమన్‌జ్యోతి శ్రావణ్, విజయ్ బసుదే తదితరులు పాల్గొన్నారు.