హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం లక్కోరా ఎంపిటిసి ఈర్మ గంగామణి బిజెపి పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం హైదరాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వారి అనుచరులతో కలిసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తుందని, తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని గంగామణి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ఇంచార్జ్ సెక్రటరీ ముజీబ్, మండల పార్టీ అధ్యక్షులు నాగధర్, జెడ్పిటిసి భారతి రాకేష్ చంద్ర, ఎంపిపి బీమా జమున, జిల్లా ఆర్ట్ఎ మెంబర్, పార్టీ సీనియర్ నాయకులు రేగుళ్ల రాములు, సర్పంచ్ లు ఆకుల రాజేశ్వర్ అమినాపూర్, వంశీ లక్కోర, గంగారెడ్డి నడకూడా, రమేష్ జానకం పెట్, నితీష్ కొత్తపల్లి, సుధాకర్ సాహెబ్ పెట్, అమినాపూర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -