Monday, December 23, 2024

శ్రీ లక్ష్మీనరసింహుడికి వైభవంగా ఏకాదశి లక్ష పుష్పార్చన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామి, అమ్మవారలకు వైభవంగా లక్ష పుష్పార్చన పూజను నిర్వహించారు. సోమవారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదార్శన నారసింహ హోమం పూజలతో భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు.ఏకాదశి పురస్కరించుకొని ఆలయ ముఖమండపంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి అలంకరించి రంగు రంగుల పరిమలముగల వివిధ రకముల పుష్పలతో వైభవంగా లక్ష పుష్పర్చన పూజలను అర్చకులు నిర్వహించారు. శ్రీవారి పుష్పర్చనలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. ఆలయంలో జరుగు నిత్యపూజలైన నిత్యకల్యాణం, సువర్ణ పుష్పర్చన, వెండి జోడి సేవ, శ్రీత్యనారాయణ వ్రతపూజలలో భక్తులు పాల్గోని దర్శించుకున్నారు.

రామలీంగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి కొండపైన కొలువుదీరిన శ్రీ పర్వత వర్ధీణీ రామలింగేశ్వర స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో శివుడి అభిషేక పూజలు, రుద్ర హోమ పూజలు శాస్రోక్తంగా పండితులు నిర్వహించగా భక్తులు, స్థానికులు పాల్గొని శివ దర్శనం చేసుకున్నారు. ఉపవాసాలతో ఉన్న భక్తులు శివ దర్శనము ప్రత్యేక పూజలు చేసి తమ మెక్కుబడులను చెల్లించారు. ఉదయం శివాలయంలో అర్చకులు అభిషేక పూజలు, శివాలయంలో జరుగు నిత్యపూజలో భాగంగా ఆలయ ఆవరణలో రుద్రహోమ పూజలను అర్చకులు, పండితులు శాస్త్రానుసారం నిర్వహించగా,సాయంత్రము శివాలయ ఆవరణలో మేళతాళముల మద్య వేదమంత్రోచ్చరన గావిస్తు శివుడని ఊరేగించగా భక్తులు దర్శించుకున్నారు.

ఆలయ నిత్యరాబడి…
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము ఆలయ నిత్యరాబడిలో భాగంగా సోమవారం 42,79,573 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వార 18,08,900, కొండపైకి వాహన అనుమతితో 5,50,000, ప్రధాన బుకంగ్ ద్వార, 4,65,450 విఐపి దర్శనము ద్వార 3,30,000 బ్రేక్ దర్శనముతో 2,70,600 వ్రతపూజలతో 2,19,200 తోపాటూ పలు శాఖలు, పాతగుట్ట ఆలయం నుండి నిత్యరాబడి సమకూరినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News