Sunday, December 22, 2024

మరో విరాట్‌నవుతా..

- Advertisement -
- Advertisement -

భారత స్టార్ షట్లర్ లక్షసేన్

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌లో లక్షసేన్ అగ్రశ్రేణి షట్లర్‌గా కొనసాగుతున్న తెలిసిందే. అద్భుత ఆటతో ప్రపంచ బ్యాడ్మింటన్‌పై తనదైన ముద్రవేశాడు. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో లక్షసేన్ అసాధారణ రీతిలో రాణించాడు. తృటిలో కాంస్యం సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న లక్షసేన్ తన భవిష్యత్తు ప్రణాళిక గురించి వివరించాడు. భారత క్రికెట్‌పై విరాట్ కోహ్లి తనదైన ముద్రవేశాడన్నాడు. తాను కూడా భారత బ్యాడ్మింటన్‌లో విరాట్‌లాగే ముందుకు సాగాలని భావిస్తున్నట్టు తెలిపాడు. బ్యాడ్మింటన్‌లో మరో విరాట్‌గా మారడమే తన ముందున్న అతిపెద్ద లక్షమని స్పష్టం చేశాడు.

ఈ ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశం కొద్దిలో చేజారిందన్నాడు. రానున్న క్రీడల్లో ఈ లోపాన్ని సరిదిద్దుకుంటానని పేర్కొన్నాడు. వచ్చే ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్షంగా ముందుకు సాగుతాడనని తెలిపాడు. కాగా, భారత క్రికెట్‌ను ప్రపంచ వ్యాప్తం చేయడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడన్నాడు. తాను కూడా బ్యాడ్మింటన్‌లో విరాట్ పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని లక్షసేన్ అన్నాడు. విరాట్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతానని వివరించాడు.కష్ట సమయాల్లోనూ దూకుడుగా ఉండడం ఎలా కోహ్లిని చూస్తే సరిపోతుందన్నాడు. విజయం కోసం చివరి వరక పోరాడటం విరాట్ నుంచే నేర్చుకుంటానని పేర్కొన్నాడు. ఇక భారత బ్యాడ్మింటన్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదన్నాడు. అయితే వీరికి మరింత మెరుగైన శిక్షణ లభిస్తే రానున్న రోజుల్లో భారత్ ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించడం ఖాయమని సేన్ జోస్యం చెప్పాడు.

అక్సల్సెన్ సలహాలు పాటిస్తా..

మరోవైపు డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సల్సెన్ అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. బ్యాడ్మింటన్‌లో తాను ఈ స్థాయికి చేరుకున్నానంటే అతనిచ్చిన సలహాలు, చిట్కాలే కారణమన్నాడు. అతని నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని వివరించాడు. మైదానంలోనూ, బయట అక్సెల్సెన్ తనను ఎంతో ప్రోత్సాహం అందిస్తాడన్నాడు. అతనితో కలిసి రెండు వారాట పాటు సాధన చేసే అవకాశం వచ్చింది. దాని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. పారిస్ ఒలింపిక్స్ సెమీస్‌లో విక్టర్ నుంచి తనకు గట్టి పోటీ ఎదురైందన్నాడు. విజయం కోసం చివరి వరకు గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయిందన్నాడు. మ్యాచ్ అనంతరం తన దగ్గరకు వచ్చిన విక్టర్ ధైర్యాన్ని నూరిపోసాడన్నాడు. ఇది తనకు ఎంతో ఊరటనిచ్చిందని లక్షసేన్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News