Monday, December 23, 2024

ప్రభుత్వ పాఠశాలలో అగ్నిప్రమాదం….

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో తరగతి గదుల్లోని బెంచీలు, ఫర్నిచర్ కు మంటలు అంటుకుని ఉవెత్తున మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని దాదాపు అరగంట పాటు శ్రమించి మంటలను ఆర్పారు. కాగా ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News