Monday, December 23, 2024

గోదావరిలో పెరిగిన వరద ఉధృతి… లక్ష్మీ బ్యారేజ్ వద్ద 3 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో  కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నది వరద  క్రమంగా పెరుగుతుంది.  గోదావరి పుష్కర ఘాట్ ల వద్ద 7.320 మీటర్ల ఎత్తులో ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి.  మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్ 3 గేట్లు ఎత్తడంతో 9,816 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.  మేడిగడ్డ వద్ద ఇన్ ప్లో, 24,375 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 9,816 క్యూసెక్కులు ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టిఎంసిలుండగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం13.05 టిఎంసిలుగా ఉంది.  వారం రోజుల నుంచి ఏడు మోటార్ల ద్వారా ఐదు టిఎంసిల నీళ్లను అన్నారం సరస్వతి బ్యారేజీలోకి తరలిస్తున్నారు. ఇన్ ప్లో 9374 క్యూసెక్కులుండగా సరస్వతి బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 10.87 టిఎంసిలుకాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 8.02 టిఎంసిలుగా ఉంది.

Also Read: గుజరాత్‌కు గుడ్‌బై

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News