Monday, December 23, 2024

జగద్రక్షకుడిగా శ్రీ లక్ష్మీనరసింహుడి అలంకార సేవలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రములో జరుగుతున్న ఆలయ అధ్యయనోత్సవాల అలంకార సేవలో జగద్రక్షకుడిగా యాదాద్రివాసుడు భక్తకోటికి దర్శనమిచ్చాడు. ఆరు రోజులపాటూ సాగుతున్న ఆలయ అధ్యయనోత్సవాలలో ఐదవ రోజు శ్రీలక్ష్మీనరసింహుడు వటప్రతశాయి, వైకుంఠనాధుడి అలంకార రూపములో దర్శనమిచ్చాడు. శుక్రవారము ఉదయం అధ్యయనోత్సవాలో భాగంగా ప్రధాన ఆలయంలో నిత్యారాధనల అనంతరము దివ్యప్రబంద పారాయాణములు పారాయణకులచే గావించి, అర్చకులు శాస్రోక్త పూజలను నిర్వహించి శ్రీలక్ష్మీనరసింహుడిని వటప్రతశాయి రూపిడిగా అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీవారి అలంకార సేవను మేళతాలముల మద్య, వేద మంత్రాలను ఉచ్చారణ చేస్తూ ఆలయ తిరువీధులలో శ్రీ స్వామి వారి అలంకార సేవను ఊరేగించగా భక్తజనులు శ్రీవారి సేవను దర్శించుకొని తరించారు.

ఉత్సవ మండపములో శ్రీవారి అలంకార సేవను వేచింపచేసి పాంచరాత్ర ఆగమరీత్యా మంత్రోచ్చరణ గావించి వటపత్రశాయి అలంకార సేవ విశిష్టతను భక్తులకు తెలియ చేశారు. సకల చరాచర ప్రపంచమంతా నీటిలో మునిగి ఉన్నప్పుడు తిరిగి సృష్టి ప్రారంభిచాలని భగవానుడు సంకల్పించుకుని నీటిపై తేలియాడుతూ ఒక మర్రి ఆకును సృష్టించి దానిపై బాల ముకుందుడిగా శయనించిన తీరు వటప్రతశాయి అలంకార సేవ విశిష్టతగా తెలిపారు. అధ్యయనోత్సవాల మహోత్సవాన్ని ఆలయ ప్రధానార్చకులు నల్లందీల్ శ్రీలక్ష్మీనరసింహ చార్యులు, ఉప ప్రధానార్చకులు కాడూరి వెంకటచార్యలు, సురెంద్ర చార్యలు, మాదవాచార్యలు, వేద పండితులు, అర్చకుల బృదం, పారాఁదణికులు అత్యంత వైభవంగా నిర్వహించారు.

వైకుంఠనాథుడుగా …

అధ్యయనోత్సవములో భాగంగా ఆలయములో సాయంత్రము నిత్యారాధన అనంతరము ద్రావిడ ప్రబంధ సేవాకాలము పారాయణకులచే పారాయణము గావించి శ్రీలక్ష్మీనరసింహుడిని పరమపదనాధుడి (వైకుంఠనాధుడు)గా అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీ స్వామి వారి అలంకార సేవను మేళతాలముల మద్య, వేదమంత్రోచరణ గావిస్తూ ఆలయ తిరువీధులలో ఊరేగించగా భక్తజనులు దర్శించుకున్నారు. ఉత్సవ మండపములో శ్రీవారి సేవను వేచింపచేసి వైకుంఠనాధుడి అలంకార సేవ విశిష్టతను తెలియ చేశారు. అత్యంత వైభవంగా నిర్వహించిన ఆలంకార సేవ, పూజ వేడుకలలో ఎమ్మేల్సీ సురభి వాణి,కమిటి ప్రెస్ ఆడ్వెసరీ జార్ఖండ్ లెజిస్లెటివ్ అసెంబ్లి నుండి వినయ్ కుమార్, నవీన్ కుమార్,అశోక్ కుమార్, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ఈవో గీత, ఆలయ ఉద్యోగసిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.

రేపటితో ముగియనున్న అధ్యయనోత్సవాలు…

శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రము అధ్యయనోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈనెల 2 వతేది నుండి 7వ తేదివరకు ఆరు రోజులపాటు అత్యంత వైభవంగా కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు శనివారము రోజున పరిసమాప్తి కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News