Friday, January 24, 2025

లక్ష్మీపార్వతికి ఏయూలో ప్రొఫెసర్ షిప్?

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం:  ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) జగన్ పాలనలో వైసిపి కార్యాలయంగా మారిపోయిందని, అప్పట్లో విసిగా వ్యవహరించిన ప్రసాదరెడ్డి అడ్డగోలుగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. తాజాగా ఆయన నిర్వాకాల్లో ఒకటి బయటపడింది. వైసిపి నేత లక్ష్మీపార్వతికి ఆయన ఏకంగా ప్రొఫెసర్ షిప్ హోదా కట్టబెట్టారు. పిహెచ్ డి విద్యార్థులకు  గైడ్ గా నియమించారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హతలు లేకున్నా ఈ నియామకం జరిగింది. దీనిపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసినా ప్రసాద రెడ్డి పట్టించుకోలేదని సమాచారం.

వివిధ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నవారు పిహెచ్ డి చేసే అవకాశం కల్పించేందుకు ఏయూలో టిడిఆర్  హబ్ ను ఏర్పాటు చేశారు. అప్పట్లో విసి ప్రసాద రెడ్డి ఇందులో తెలుగు ప్రొఫెసర్ హోదాతో లక్ష్మీపార్వతిని గైడ్ గా నియమించారు. పది మంది పరిశోధకులకు ఆమెను గైడ్‌ను చేశారు. విజయవాడలో ఉంటున్న లక్ష్మీపార్వతి విశాఖపట్నం వచ్చేది ఎప్పుడు.. తమను గైడ్ చేసేదెన్నడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అవన్నీ తాము చూసుకుంటామని విసి ప్రసాద రెడ్డి వారికి చెప్పారు. వైసిపికి అన్ని రకాలుగా సహకరించిన ఉద్యోగులు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులకు అవసరమైన పిహెచ్‌డిలు ప్రదానం చేసేందుకే ఈ టిడిఆర్‌ హబ్‌ని ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News