Saturday, January 11, 2025

కమనీయంగా లక్ష్మిచెన్నకేశవ స్వామి కళ్యాణం

- Advertisement -
- Advertisement -

బెజ్జంకి : మంత్రి హరీశ్‌రావు స్వగ్రామం మండలంలోని తోటపల్లిలో నెలకొన్న లక్ష్మిచెన్న కేశవ స్వామి 4 వార్షికోత్సవంలో భాగంగా స్వామి వారి తీరు కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోత్సవాల మద్య వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కళ్యాణోత్సవంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాతృమూర్తి తన్నీరు లక్ష్మిబాయ్ పాల్గొని స్వామి వారికి వెండి కిరీటం బహూకరించారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండి ఆర్థ్ధికంగా అభివృద్ధ్ది చెందాలని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కవిత, ఎంపిటిసి లక్ష్మి, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, మాజీ ఎఎంసీ చైర్మన్ కచ్చురాజయ్య, నాయకులు తన్నీరు గౌతమ్ రావు , దంపతులు బోయిని పల్లి శ్రీనివాస్‌రావు, లక్ష్మణ్, చెందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News