వారణాసి: అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేసిన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ నేడు కన్నుమూశారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. అనారోగ్య కారణంగా ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారణాసిలోని గంగా నది తీరంలోని మణికర్ణిక ఘాట్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
వారణాసి పండితుల్లో లక్ష్మీకాంత్ దీక్షిత్ అగ్రగణ్యులు. వారా స్వస్థలం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా. కానీ వారి కుటుంబం ఎన్నో తరాలుగా వారణాసిలో స్థిరపడింది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ ఆయన మృతిపట్ల స్పందించారు. తన ఎక్స్ పోస్ట్ లో సంతాపం వ్యక్తం చేశారు.
काशी के प्रकांड विद्वान एवं श्री राम जन्मभूमि प्राण प्रतिष्ठा के मुख्य पुरोहित, वेदमूर्ति, आचार्य श्री लक्ष्मीकांत दीक्षित जी का गोलोकगमन अध्यात्म व साहित्य जगत की अपूरणीय क्षति है।
संस्कृत भाषा व भारतीय संस्कृति की सेवा हेतु वे सदैव स्मरणीय रहेंगे।
प्रभु श्री राम से प्रार्थना…
— Yogi Adityanath (@myogiadityanath) June 22, 2024