Wednesday, January 22, 2025

సెమీ ఫైనల్లో లక్ష్యసేన్

- Advertisement -
- Advertisement -

టోక్యో: ప్రతిష్టాత్మకమైన జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అయితే మరో అగ్రశ్రేణి ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్‌సాయిరాజ్‌చిరాగ్ శెట్టి జంట కూడా ఓటమి పాలైంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో లక్షసేన్ సెమీస్‌కు చేరుకుని టైటిల్ రేసులో నిలిచాడు.

శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన వతనాబేను ఓడించాడు. చివరి వరకు ఆధిపత్యాన్ని చెలాయించిన లక్షసేన్ 2115, 2119 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. తొలి సెట్‌లో సేన్ దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో మాత్రం సేన్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈసారి జపాన్ షట్లర్ పుంజుకున్నాడు. చక్కటి షాట్లతో సేన్‌ను హడలెత్తించాడు. ఇటు సేన్ అటు వతనాబే ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు ఆసక్తికగా సాగింది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన సేన్ వరుసగా రెండో సెట్‌ను కూడా గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు.

ఇక హోరాహోరీగా సాగిన మరో క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ పోరాడి ఓడాడు. డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్‌సెన్‌తో జరిగిన మూడు సెట్ల సమరంలో ప్రణయ్ 2119, 1821, 821 తేడాతో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్‌లో గెలిచిన ప్రణయ్ ఆ తర్వాత రెండు గేమ్‌లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక డబుల్స్‌లో సాత్విక్ జోడీకి చుక్కెదురైంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జంట క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. తైవాన్‌కు చెందిన లీవాంగ్ జంటతో జరిగిన హోరాహోరీ సమరంలో సాత్విక్ జోడీ ఓటమి పాలైంది. తైవాన్ జంట 2115, 2325, 2116 తేడాతో సాత్విక్ జంటను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News