Wednesday, January 22, 2025

లక్ష్యసేన్ సంచలనం..

- Advertisement -
- Advertisement -

Lakshya Sen win India Open Title 2022

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ యువ ఆటగాడు లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు. ఇండియా ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ఛాంపియన్‌గా అవతరించాడు. ప్రపంచ ఛాంపియన్, సింగపూర్ షట్లర్ లోహ్ కీన్ యూను 24-22, 21-17 తేడాతో ఓడించాడు. 20 ఏళ్ల ఈ యువ ఆటగాడు తొలి బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అంతకు ముందు పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ ద్వయం మహ్మద్ అషాన్, హెండ్రా సెటియావన్‌ను 21-16, 26-24 తేడాతో వరుస గేముల్లో ఓడించింది. స్వర్ణ పతకం అందుకుంది.
తొలి నుంచి హోరాహోరీగా..
తొలి గేమ్‌లో లక్ష్యసేన్, కీన్ నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. 2-2, 4-4, 6-6తో సమంగా దూసుకుపోయారు. లక్ష్యసేన్ వేగం పెంచి తనదైన రీతిలో స్మాష్లు బాదేశాడు. 13-8తో ఆధిక్యంలో కి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో కీన్ పుం జుకున్నాడు. మ్యాచ్ 18-14తో ఉన్నప్పుడు వరుసగా 6 పాయింట్లు సాధించి 20-20తో స్కోరు సమం చేశాడు. గేమ్ పా యింట్ సమీపించడంతో ఇద్దరూ పట్టువదలకుండా శ్రమించారు. 21-21, 22-22 వరకు సమంగా పోరాడారు. 22 వద్ద ఒక పాయింట్ సేవ్ చేసుకున్న లక్ష్య గేమ్ పాయింట్‌కు చేరువయ్యాడు. ఆ తర్వాత మరో పాయిం టు సాధించి 24-22 గేమ్ గెలిచాడు. రెండో గేమ్‌లో లక్ష్యసేన్ ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వలేదు. 6-6తో స్కోరు సమమైనా ఆ తర్వాత వరుస స్మాష్‌లు సంధించాడు. 20-17తో గేమ్‌తో పాటు మ్యాచ్ గెలిచేశాడు.

Lakshya Sen win India Open Title 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News