Monday, December 23, 2024

ఛాంపియన్ లక్షసేన్..

- Advertisement -
- Advertisement -

కాల్గరీ : భారత ప్టార్ షట్లర్ లక్షసేన్ సంచలనం సృష్టించాడు. కెనెడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్లో ఆల్ ఇంగ్లండ్ చాంఫియన్ లి షి పెంగ్‌పై వరుస సెట్లతో విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ తుదిపోరులో కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ లక్షసేన్ 2118 2220తో వరుస సెట్లను కైవసం చేసుకొని గెలుపొందాడు. కాగా, లక్ష్యసేన్‌కు కెరీర్‌లో ఇది రెండో బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిల్ కావడం విశేషం. ప్రపంచ 19వ ర్యాంక్‌లో కొనసాగుతున్న లక్ష్యసేన్ తన కన్నా ప్రపంచ 10వ ర్యాంకర్ లి షి ఫెంగ్‌పై మెరుగైన ఆటతీరును కనబర్చి కెనడా ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ విక్టరీతో బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ లో లక్ష్య సేన్ 12వ స్థానానికి చేరుకున్నాడు. ఆ తర్వాత యూఎస్ ఓపెనే టార్గెట్ గా తదుపరి మ్యాచ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు లక్ష్యసేన్.

సెమీస్‌లో అలవోకగా..
ఇక ఈ టోర్నీలో లక్ష్యసేన్ అంచనాలకు మించి రాణించాడు. కీలకమైన సెమీ ఫైనల్లో అతను 11వ ర్యాంకర్ కెంట నిషిమొటోను చిత్తు చేసి ముందుకు సాగాడు. దీంతో రెండోసారి డబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిల్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో 44 నిమిషాలు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ నిషిమొటోపై ఆధిపత్యం పోరుతో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-17, 21-14తో విజయం సాధించాడు. దీంతో ఈ జపాన్ ఆటగాడిపై తన రికార్డును 2-1కు పెంచుకున్నాడు. తుదిపోరులో దూకుడుగా ఆడి రెండు సెట్లలోనే గేమ్ ముగించి టైటిల్ గెలుపొందాడు.

చాలా సంతోషంగా ఉంది..
మ్యాచ్ గెలిచిన అనంతరం షెట్లర్ లక్ష్య సేన్ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశాడు. ‘కొన్నిసార్లు కష్టతరమైన పోరాటాలు మధురమైన విజయాలకు దారితీస్తాయి. నిరీక్షణ ముగిసింది. కెనడా ఓపెన్ విజేతగా నిలిచినందుకు నేను సంతోషిస్తున్నాను’ అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. కెనడా ఓపెన్ టైటిల్ గెలుచుకోవటం పట్ల లక్ష్యసేన్‌పై క్రీడాభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. పలువురు క్రీడాకారులు లక్ష్యసేన్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News