Saturday, April 5, 2025

కల చెదిరిన లక్ష్యసేన్

- Advertisement -
- Advertisement -

పారిస్: ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించే అవకాశాన్ని భారత స్టార్ షట ర్ లక్షసేన్ కోల్పోయాడు. సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సిం గిల్స్ కాంస్య పతక పోరులో సేన్ పరాజయం చవిచూశాడు. మలేసియా ఆటగాడు జియా లీతో జరిగిన పోరులో సేన్ ఓటమి పాలయ్యాడు. ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్‌లో లీ 1321, 2116, 2111 తేడాతో సేన్‌ను ఓడించా డు. తొలి సెట్‌లో సేన్ ఆధిపత్యం చెలాయించాడు. అద్భుత షాట్లతో ప్రత్యర్థి ని ముప్పుతిప్పలు పెట్టాడు. సేన్ ధాటికి తట్టుకోలేక లీ చేతులెత్తేశాడు. దూకుడుగా ఆడిన సేన్ అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్ ఆరంభంలోనూ సేన్ పైచేయి కనబరిచాడు. తన మార్క్ ఆటతో ప్రత్యర్థిని హడలెత్తించాడు. ఒక దశలో 85తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ కీలక సమయం లో లీ పుంజుకున్నాడు. సేన్ దూకుడును అడ్డుకుంటూ పైచేయి సాధించాడు. మరోవైపు సేన్ తీవ్ర ఒత్తిడికి గురై వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని త నకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన లీ సెట్‌ను దక్కించుకున్నా డు. ఇక ఫలితాన్ని తేల్చే కీలకమైన మూడో సెట్‌లో సేన్ గాయపడ్డాడు. ఇది అతని ఏకాగ్రతను దెబ్బతిసింది. మ్యాచ్ ఆడే క్రమంలో లక్షసేన్ మోచేతి నుంచి రక్తం వచ్చింది. చికిత్స తర్వాత సేన్ ఆటను కొనసాగించాడు. అయితే గాయం బాధ వెంటాడడంతో స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయాడు. సెట్‌తో పాటు మ్యాచ్ కోల్పోయి కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News