Monday, December 23, 2024

బిజెపిలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు

- Advertisement -
- Advertisement -

బిజెపిలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు

లక్నో: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు భూపేందర్ సింగ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఉద్దేశించి రాసిన లేఖలో విభాకర్ శాస్త్రి పేర్కొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు హరి కృష్ణ శాస్త్రి కుమారుడైన విభాకర్ శాస్త్రి గతంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల కొంత కాలంగా వలసల పర్వం కొనసాగుతోంది. పార్టీకి చెందిన పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. రెండు రోజుల క్రితమే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. మిలింద్ దేవర, బాబా సిద్దిఖి, జ్యోతిరాదిత్య సింధియా, హిమంత బిశ్వ శర్మ, జితిన్ ప్రసాద్, ప్రియాంక చతుర్వేది, సుస్మితా దేవ్, ఆర్‌పిఎన్ సింగ్, బల్వీర్ షేర్‌గిల్ తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడి వివిధ పార్టీలలో చేరారు. కాగా..విభాకర్ శాస్త్రి బిజెపిలో చేరడం సామాజిక కార్యకర్తలకు శుభ సందేహని ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు.

మాజీ ప్రధాని కుటుంబానికి చెందిన విభాకర్ శాస్త్రి బిజెపిలో చేరడం వల్ల తమ పార్టీకి మంచి పరిణామమని ఆయన అన్నారు. విభాకర్ శాస్త్రి నిర్ణయాన్ని ఆయన మరో సోదరుడు సిద్ధార్థ్ నాథ్ సింగ్ స్వాగతించారు. సిద్ధార్థ్ నాథ్ ప్రస్తుతం అలహాబాద్ పశ్చిమ స్థానం నుంచి బిజెపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి చెందిన సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ నినాదం కేంద్రం, రాష్ట్రాలలోని బిజెపి ప్రభుత్వాలకు మార్గదర్శకంగా పనిచేస్తోందని, ఈ నినాదం అందరినీ ఆకర్షిస్తోందని బిజెపిలో చేరిన అనంతరం విభాకర్ శాస్త్రి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News