Monday, December 23, 2024

లాల్ దర్వాజ అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేత

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: పాతబస్తీ సింహవాహిని మహంకాళి అమ్మవారి దేవాలయం 115వ వార్సికోత్సవం పురస్కరించుకుని గాంధీ నగర్ డివిజన్ కార్పొరేటర్ దంపతులు పావని వినయ్ కుమార్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కార్పొరేటర్ పావని బోనం ఎత్తుకుని నడిచి నైవేద్యం సమర్పించగా, ఆమె భర్త వినయ్ కుమార్ ఆధ్వర్యంలో పోచంపల్లిలోని ఏనుగుల కుటుంబ సభ్యులు స్వహస్తాలతో నేసిన పోచంపల్లి చేనేత పట్టు వస్త్రాలను అమ్మవారికి అందజేశారు.

ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు, డప్పు చప్పుళ్ల మధ్య సుమారు 200 మంది భారీ ఊరేగింపుతో పాతబస్తీ లాల్ దర్వాజ శ్రీసింహ వాహిని అమ్మవారి ఆలయానికి తరళివెళ్లారు. దేవాలయం వద్ద ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ కార్పొరేటర్ దంపతులకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.అనంతరం అమ్మవారికి మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో బిజేపి నగర నాయకులు వినయ్‌కుమార్, అనిల్ కుమార్, ఆలే జితేంద్ర, ఏనుగుల కుటుంబ సభ్యులు, బిజేపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News