Sunday, January 19, 2025

ఘనంగా ప్రారంభమైన లాల్‌దర్వాజ బోనాల సంబురాలు.

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు సంబరాలు ఈరోజు(ఆదివారం) ఘనంగా ప్రారంభమయ్యాయి. బోనాల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ బోనాల జాతరలో పాల్గొననున్న నేపథ్యంలో ఆలయం వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు. అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు తొలి బోనం, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

కాగా, బోనాల పండగ సందర్భంగా ఈ రోజు వైన్‌షాపులు బంద్ కానున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం 6గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి.

Also Read: అమ్మా నీకు ‘బోనమే తల్లీ’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News