Monday, December 23, 2024

‘లాల్ సింగ్ చడ్ఢా’ మెగా ప్రివ్యూ..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్ఢా. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగ చైతన్య నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ‘లాల్ సింగ్ చడ్ఢా’ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు అమీర్ ఖాన్ తన ప్రియమిత్రుడు మెగాస్టార్ చిరంజీవి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అతిథుల కోసం తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన ‘లాల్ సింగ్ చడ్ఢా’ ప్రత్యేక ప్రివ్యూను హైదరాబాద్‌లో నిర్వహించారు. తాజాగా హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ జరిగింది. ఈ ప్రివ్యూకి ప్రత్యేక అతిథులుగా కింగ్ నాగార్జున, అక్కినేని నాగచైతన్య, స్టార్ డైరెక్టర్లు ఎస్‌ఎస్.రాజమౌళి, సుకుమార్ హాజరయ్యారు. ఇక మెగాస్టార్‌తో పాటు హాజరైన అతిథులంతా ఈ సినిమా పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

‘Lal Singh Chaddha’ Preview for Stars in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News