Monday, December 23, 2024

అదరగొట్టిన ‘లాలా భీమ్లా…’ డిజె వర్షన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ’భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే, సంభాషణలను సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. ఇక ఇప్పటికే మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘లాలా భీమ్లా… అడవి పులి….’ సాంగ్ డిజె వర్షన్‌ను శుక్రవారం విడుదల చేశారు. త్రివిక్రమ్ ఈ గీతాన్ని రచించిన విషయం తెలిసిందే. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం ఆయన తనదైన శైలిని పలికించారని స్పష్టం చేసింది ఈ గీతం. 2021కి వీడ్కోలు పలుకుతూ..నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విడుదల చేసిన ఈ గీతం సినీ అభిమానుల ఆనందోత్సాహాలను మరోమారు అంబరాన్ని తాకేలా చేసింది. ‘భీమ్లా నాయక్’ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది.

‘Lala Bheemla’ Song DJ Version Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News