Friday, November 15, 2024

మిజోరం ముఖ్యమంత్రిగా లాల్దుహోమా ప్రమాణం

- Advertisement -
- Advertisement -

ఐజావల్: మిజోరం నూతన ముఖ్యమంత్రి జోరం పీపుల్స్ మూవ్‌మెంట్(జడ్‌పిఎం) నాయకుడు లాల్దుహోమా శుక్రవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లాల్దుహోమా చేత రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్)నాయకుడు, ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న జోరంతంగ కూడా హాజరయ్యారు.

ఎంఎన్‌ఎఫ్‌కు చెందిన ఎమ్మెల్యేలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి లాల్ తన్‌హావ్లా కూడా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. జడ్‌పిఎం శాసనసభా పక్ష నాయకునిగా లాల్దుహోమా, ఉప నాయకుడిగా కె సప్దంగ గత మంగళవారం ఎన్నికయ్యారు. 40 మంది సభ్యుల మిజోరం అసెంబ్లీలో ముఖ్యమంత్రితోసహా 12 మంది మంత్రులు ఉండనున్నారు. మిగిలిన 11 మంది మంత్రులు కూడా త్వరలోనే పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. 2019లో రాజకీయ పార్టీగా అవతరించిన జడ్‌పిఎం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 27 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News