Friday, April 4, 2025

నెటిజన్లను ఆశ్చర్యపరచిన లలిత్ మోడీ

- Advertisement -
- Advertisement -

 

Lalit Moti and Susmita Sen

ముంబై: సుస్మితా సేన్‌తో డేటింగ్ చేసినట్లు లలిత్ మోడీ చివరికి ధృవీకరించారు. 2013లోనే ఆయన సుస్మితకు ట్వీట్ చేశారు. అప్పట్లో వాట్సాప్ అంతగా చెలామణిలో లేదు. లలిత్ మోడీ క్రికెట్‌లో తనదైన శైలిని ఏర్పరచుకున్న వ్యక్తి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఏర్పాటు చేశాడు. కాకపోతే ఆయన ఆర్థిక అవకతవకలు, దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఎప్పుడైతే అతడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ఈడి) రాడార్‌లోకి వచ్చాడో అప్పుడు లండన్‌కు పారిపోయాడు. ఆయన జులై 14 రాత్రి సోషల్ మీడియాలో సుస్మితతో దిగిన ఫోటోలను పోస్ట్ చేసి, తామిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపాడు. మాల్దీవులు, సార్డినియా వంటి ప్రపంచ ప్రాంతాలు చుట్టేసి ఇప్పుడే లండన్ వచ్చానని పోస్ట్‌లో తెలిపారు. పైగా తన భాగస్వామి సుస్మితా గురించి చెప్పక తప్పదన్నారు. కొత్త ఆరంభం, కొత్త జీవితం అంటూ చెప్పుకొచ్చారు. ప్రేమ అంటే పెళ్లనే కాదు… దేవుని కరుణ ఉంటే అది కూడా ఏదో ఒక రోజు జరగొచ్చు. కేవలం చెప్పాలనుకుంటుందేమిటంటే మేమిద్దరం కలిశాము” అని ఆయన పోస్ట్‌లో వివరించాడు. లలిత్ మోడీ, మినాల్ మోడీని వివాహం చేసుకుని 27 ఏళ్లపాటు కాపురం చేశాడు. అయితే ఆమె కేన్సర్ తో 2018లో కన్నుమూసింది. కాగా మోడీ డేటింగ్ కు సంబంధించిన ఈ ప్రకటనపై సుస్మిత నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News