Tuesday, January 21, 2025

లలిత్ మోడీ క్షమాపణ చెప్పాలి: సుప్రీం ఆదేశం

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో భారత న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు చేసినందుకు ఐపిఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లలిత్ మోడీ చట్టానికి, వ్యవస్థలకు అతీతమేమీ కాదని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. లలిత్ మోడీ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌పై తాము సంతృప్తి చెందడం లేదని ధర్మాసనం పేర్కొంది. లలిత్ మోడీ సోషల్ మీడియాలో, ప్రముఖ జాతీయ వార్తాపత్రికలలో క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతీయ న్యాయవ్యవస్థను కించపరిచే, అప్రతిష్ట పాల్జేసే విధంగా ఎటువంటి పోస్టులు భవిష్యత్తులో పెట్టబోనని పేర్కొంటూ క్షమాపణలతో కూడిన అఫిడవిట్‌ను తమ ఎదుట దాఖలు చేయాలని లలిత్ మోడీని ధర్మాసనం ఆదేశించింది.

Also Read: నదిలో మొసలితో పోరాడి భర్తను కాపాడిన భార్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News