Monday, January 20, 2025

క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

Laloo health condition
రీమ్స్ నుంచి ఎయిమ్స్‌కు తరలింపు

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య క్షీణించింది. దాంతో రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు హుటాహుటిన తరలించాలనుకుంటున్నారు. ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. క్రియాటిన్ లెవల్ పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను మంగళవారం ఎయిమ్స్‌కు తరలించాలని జైలు అధికారులు రిఫర్ చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర్ ప్రసాద్ తెలిపారు. ఇదిలావుండగా, దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు ఏప్రిల్ 1వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు మార్చి 11న కొట్టేసింది. లాలూకు ఆరోగ్య సమస్యలున్నాయి. ఆయన ఆరోగ్యం సోమవారం రాత్రి క్షీణించింది. ఎయిర్ అంబులెన్స్‌లో లాలూను ఎయిమ్స్‌కు తరలించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News