Sunday, February 23, 2025

ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన లాలూ ప్రసాద్

- Advertisement -
- Advertisement -

Lalu Prasad Yadav Admitted To AIIMS Delhi

 

న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ ను విమానంలో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ కు బుధవారం  తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన ఇటీవల తన నివాసంలో మెట్లపై నుంచి జారిపోవడంతో గాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించి వైద్య సేవలందిస్తున్నారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ కు లాలూకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. లాలూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆర్జేడీ వర్గాల కథనం ప్రకారం లాలూ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనను వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆయన భుజం నడుము ఎముకలు చిట్లినట్లు వైద్యులు చెప్పారు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News