Thursday, January 23, 2025

మెట్లపై నుంచి జారిపడ్డ ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్ యాదవ్

- Advertisement -
- Advertisement -

Lalu Prasad Yadav

పట్నా: రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో మెట్లు దిగుతుండగా కాలుజారి పడిపోయారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో లాలూ భుజానికి ఫ్రాక్చర్‌ అయినట్లు తెలిసింది. వీపుపై కూడా గాయాలయ్యాయి. ‘లాలూ భుజంలో ఫ్రాక్చర్ అయినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. గాయమైన చోట వైద్యులు బ్యాండేజ్ చుట్టారు. కొన్ని మెడిసిన్స్ రాసి వెంటనే ఇంటికి పంపారు’ అని లాలూ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఓ వ్యక్తి చెప్పారు.

లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యల చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అనుకోకుండా ఇంట్లోనే మెట్లపై నుంచి జారిపడి గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News