Wednesday, January 22, 2025

మోడీ..ఎందుకీ ముకద్దమ్ దమ్‌దమ్

- Advertisement -
- Advertisement -

పాట్నా ః ఈ మోడీకి , సిబిఐకి, ఇడికి ఎక్కడా పనిలేనట్లుగా ఉంది. తనపై రోజుకో కేసు కేసు మీద కేసుగా పెడుతున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీ, తేజస్వీ యాదవ్‌లపై సిబిఐ తాజాగా చార్జీషీట్ దాఖలు చేసింది. దీనిని లాలూ ప్రస్తావించారు. ‘ముకద్దమా మీద ముకద్దమాలు సాగిస్తున్నారని, వీరికి భయపడేది లేదని బుధవారం ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఆర్జేడీ 27వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో కార్యక్రమం ఏర్పాటు అయింది. ఈ సందర్భంగా లాలూ తన సొంతదైన భోజ్‌పురి యాసలో మోడీపై విరుచుకుపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News