Monday, December 23, 2024

లాలూ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం

- Advertisement -
- Advertisement -
Bihar CM Visits Lalu Prasad Yadav In Hospital
సింగపూర్‌కు తరలించే అవకాశం

న్యూఢిల్లీ: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన శరీరంలో కదలికలు లేవని తనయుడు తేజస్వీ యాదవ్‌ తెలిపారు. ఇప్పటి వరకు వైద్యులు చాలా మందులు ఇచ్చారని, అయినా ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. వైద్యులు మరోసారి పరిశీలించిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు తేజస్వీ యాదవ్‌ . లాలూ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే సింగపూర్‌ తీసుకెళ్తామని అన్నారు.

లాలూ పరిస్థితి విషమించిన నేపథ్యంలో పలువురు బిహార్‌ మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఢిల్లీ ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు. లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News