Wednesday, January 22, 2025

లాలూకు అవయవ దానం చేసిన కూతురు..

- Advertisement -
- Advertisement -

పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. లాలూ కుమార్తె రోహిణి అర్చన ఆయనకు కిడ్నీ దానం చేశారు. సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆసుపత్రిలో సోమవారం ఈ శస్త్రచికిత్స పూర్తయ్యింది. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని లాలూ తనయుడు, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ వెల్లడించారు. లాలూను ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి ఐసీయూకు తరలిస్తున్న వీడియో ట్వీట్‌ చేసిన ఆయన.. తమ కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఎంతోకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పరీక్షించిన వైద్యులు కిడ్నీ మార్పిడి అనివార్యమని సూచించారు. దీంతో తన కిడ్నీని నాన్నకు ఇస్తానంటూ సింగపూర్‌లో ఉంటున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ముందుకొచ్చారు. ‘నా తల్లిదండ్రులే నాకు దేవుళ్లు. వారికోసం ఏదైనా చేస్తా’ అంటూ చెప్పిన ఆమె.. కిడ్నీ అనేది తన శరీరంలోని ఓ చిన్న ముక్క మాత్రమే అని పేర్కొన్నారు. తాజాగా సర్జరీ జరిగే కొన్ని నిమిషాల ముందు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ తమకు గుడ్‌లక్‌ చెప్పండంటూ తండ్రితో కూర్చున్న ఓ ఫొటో పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News