Sunday, December 22, 2024

అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్టకు వెళ్లను: లాలూ ప్రసాద్

- Advertisement -
- Advertisement -

ఇండోర్: ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలు త్వరితంగా జరగాలంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్(యు) తొందరపెట్టడంపై రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ చురకలు అంటించారు. అంతేగాక, అయోధ్యలో ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి వెళ్లడంపై కూడా ఆయన తన వైఖరిని స్పష్టం చేశారు. బుధవారం తన అధికారిక నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతూ అయోధ్యకు వెళ్లాలన్నకోరిక తనకు లేదని ఆయన చెప్పారు.

గతంలో బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీని అరెస్టు చేయడం ద్వారా ఆయన చేపట్టిన రథయాత్రను అప్పటి ముఖ్యమంత్రిగా అడ్డుకున్న ఘనత లాలూ ప్రసాద్‌కే దక్కుతుంది. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ఆలస్యం కావడంపై జెడియు నాయకులు వ్యక్తం చేస్తున్న అసహనం గురించి విలేకరులు ప్రస్తావించగా ఇలాంటి విషయాలు అంత తొందరగా కొలిక్కివస్తాయా&చర్చలలో పురోగతి ఉంది కదా అంటూ లాలూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మీకు ఆహ్వానం అందిందా అన్న విలేకరుల ప్రశ్నకు నేను వెళ్లడం లేదు అంటూ ఆయన కటువుగా సమాధానమిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News