Thursday, January 23, 2025

బీహార్‌లో మాదిరిగా కేంద్రంలోనూ బిజెపి అవుట్ : లాలూ ప్రసాద్

- Advertisement -
- Advertisement -

Lalu Prasad Yadav Slams Amit Shah

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాలో కంగారు మొదలైందని, బీహార్‌లో మాదిరిగా కేంద్రంలోనూ బీజెపి అవుట్ అవుతుందని ఆర్జేడీ అధ్యక్షుడు లాలాప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. 2024లో బీజేపీ అధికారాన్ని కోల్పోతుందని జోస్యం చెప్పారు. బీహార్ సిఎం నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆదివారం ఆమె నివాసంలో కలుసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ చేరుకున్న లాలాప్రసాద్ యాదవ్ మీడియాతో శనివారం మాట్లాడారు. శుక్రవారం బీహార్‌లో పర్యటించిన అమిత్‌షా చేసిన విమర్శలను ఆయన తిప్పి కొట్టారు. అమిత్‌షా కంగారుతో అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. జంగిల్ రాజ్ అంటూ ఏదో చెబుతున్నారు. గుజరాత్‌లో ఉన్నప్పుడు అమిత్‌షా ఏం చేశారు ? ఆయన ఉన్నప్పుడు జంగిల్‌రాజ్ ఉండేది అని లాలూ విమర్శించారు.

Lalu Prasad Yadav Slams Amit Shah

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News