Sunday, December 22, 2024

పెళ్లి చేసుకో.. ఆలస్యం చేయొద్దు

- Advertisement -
- Advertisement -

పాట్నా: ‘ పెళ్లి చేసుకో.. ఇంకా ఆలస్యం చేయవద్దు’ అంటూ ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం సందర్భంగా లాలూ ప్రసాద్ రాహుల్‌కు ఈ సలహా ఇచ్చారు. ‘పెళ్లి చేసుకో.. మేమంతా ఆ వేడుకలో పాల్గొంటాం ’అని లాలూ ప్రసాద్ అన్నారు. దీనికి 53 ఏళ్ల రాహుల్ నవ్వుతూ ‘ ఇప్పుడు మీరు దాని(పెళ్లి)గురించి ప్రస్తావన తెచ్చారు.

ఇక అది తప్పక జరుగుతుంది’ అని సమాధానమిచ్చారు. దానికి ‘ఇంకా ఆలస్యం ఉందా? తన మాట వినడం లేదని మీ అమ్మగారు నాతో చెప్పారు’ అని లాలూ వ్యాఖ్యానించారు. అంతేకాదు పెళ్లి గురించి ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని కూడా అన్నారు. అలాగే పెళ్లి చేసుకోవాలని గతంలో తాను ఇచ్చిన సలహాను రాహుల్ పాటించలేదని లాలూ తెలిపారు. తన సలహాను పాటించి ఉంటే ఈ పాటికి ఎప్పుడో పెళ్లి అయి ఉండేదని అన్నారు. పెళ్లిని ఇంకా ఆలస్యం చేయవద్దని రాహుల్ గాధీకి సూచించారు. దీంతో ప్రతిపక్ష సమావేశంలో పాల్గొన్న నేతలంతా నవ్వుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News