Monday, December 23, 2024

మెరుగుపడుతున్న లాలూ ప్రసాద్ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

Lalu Prasad's health is improving

ఎయిమ్స్‌లో రాహుల్ పరామర్శ

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వర్గాలు శుక్రవారం తెలిపాయి. 74 సంవత్సరాల బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌కు ఎయిమ్స్‌కు చెందిన కార్డియో న్యూరో సెంటర్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్(సిసియు)లో చికిత్స జరుగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, కొద్ది రోజుల్లో ఆయనను వార్డ్‌కు మారుస్తారని వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసుపత్రిలో లాలూను కలుసుకుని పరామర్శించారు. పాట్నాలోని తన ఇంట్లో మెట్లపై నుంచి జారిపడడంతో లాలూను గత సోమవారం పాట్నా ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను బుధవారం ఎయిర్ ఆంబులెన్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News