Friday, November 22, 2024

లోక్‌సభ బరిలో లాలూ ఇద్దరు కుమార్తెలు

- Advertisement -
- Advertisement -

22 మంది పేర్లను ప్రకటించిన ఆర్‌జెడి

పాట్నా : రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి) బీహార్‌లో 23 లోక్‌సభ సీట్లలోకి 22 సీట్లకు తమ అభ్యర్థుల పేర్లను లాంఛనంగా ప్రకటించింది. ప్రతిపక్ష ‘మహాఘట్‌బంధన్’లో భాగస్వామ్య పక్షమైన ఆర్‌జెడి 23 సీట్లకు పోటీ చేయనున్నది. పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు రోహిణీ ఆచార్య, మీసా భారతి ఆర్‌జెడి అభ్యర్థులలో ఉన్నారు. ఆర్‌జెడి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత విడుదల చేసిన ప్రకటన ప్రకారం, తన తండ్రి పలు మార్లు పోటీ చేసిన శరణ్ సీటుకు రోహిణీ ఆచార్య బరిలో ఉంటారు.

దాణా కుంభకోణంలో దోషిగా నిర్ధారితుడు కావడంతో 2013లో అనర్హతకు గురయ్యేంత వరకు లాలూ యాదవ్ ఆ సీటుకు ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభలో రెండవ పర్యాయం సభ్యురాలుగా ఉన్న మీసా భారతి పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆర్‌జెడి శివన్ సీటుకు అభ్యర్థిని ఇంకా ప్రకటించవలసి ఉందని పార్టీ నేత ఒకరు చెప్పారు. అక్కడ దివంగత మహమ్మద్ షాహుబుద్దీన్‌ను ఆర్‌జెడి చాలా సార్లు నిలబెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News