Monday, December 23, 2024

నితీశ్ కోసం తలుపులు తెరిచే ఉన్నాయి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తమతో తెగతెంపులు చేసుకుని బిజెపితో జతకట్టి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జెడియు అధ్యక్షుడు నితీశ్ కుమార్‌కు మరో మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్నేహ హస్తం చాపారు. నితీశ్ మనసు మార్చుకుంటే ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని లాలూ ప్రకటించారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడిన లాలూ ఆయన(నితీశ్) వచ్చినపుడు చూద్దాం..మా తలుపులైతేతెరిచే ఉంటాయి అని వ్యాఖ్యానించారు. నితీశ్‌కు మరోసారి అవకాశం ఇస్తారా అని విలేకరులు ప్రశ్నించగా తమ తులపులు తెరిచే ఉంటాయని, ఆయన మనసు మారి తిరిగి వస్తే ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి తమకు అభ్యంతరం లేదని చెప్పారు. కాగా..బీహార్ అసెంబ్లీలో గురువారం లాలూ, నితీశ్ పరస్పరం అభివాదం చేసుకుంటూ కనిపించడం విశేషం. లాలూ వెనుక ఆయన కుమారుడు,

నితీశ్ గత నెలలో కూలిపోయిన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు.ఈ ఘటన జరిగిన మరుసటి రోజే లాలూ నుంచి తాజా వ్యాఖ్యలు వెలువడడం తమనార్హం. జనవరి 28న ఆర్‌జెడితో బంధాన్ని తెంపుకుని బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎతో జతకట్టిన నితీశ్ కొరాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామం ఆర్‌జెడికే కాక ప్రతిపక్ష ఇండియా కూటమికి కూడా పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది. రానున్న లోక్‌సభ ఎన్నికలలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్షంతో 26 ప్రతిపక్ష పార్టీలతో ఇండియా కూటమి ఏర్పాటులో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. గత ఏడాది పాట్నాలో నితీశ్ నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీలు సమావేశమై ఇండియా కూటమి ఏర్పాటుకు బీజం వేశాయి. ఇండియా కూటమి నుంచి వేరుపడడంపై గత నితీశ్ స్పందిస్తూ ఇది సక్రమంగా పనిచేయడం లేదని,

ఆర్‌జెడి వైఖరి తనను ఇబ్బంది పెడుతోందని వ్యాఖ్యానించారు. ఇండియా బీహార్‌లో తాము నడుపుతున్న మహా కూటమి ప్రభుత్వం సక్రమంగా లేదని ఆయన చెప్పారు. నితీశ్ సారథ్యంలోని జెడియు, ఆర్‌జెడి కలసి 2022 ఆగస్టులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతకుముందు ఆయన ఎన్‌డిఎతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీశ్ తరచు కూటములు మార్చడం అనేక విమర్శలకు దారితీస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News