Sunday, November 3, 2024

ఇది కేవలం ఒక చిన్న మాంసం తునక… లాలూ కుమార్తె రోహిణీ

- Advertisement -
- Advertisement -

 

పాట్నా : డెభ్భై ఏళ్లు దాటి తీవ్ర అస్వస్థతతో ఉన్న తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ దానం ఇవ్వడానికి లాలూ రెండో కుమార్తె సింగపూర్‌లో ఉంటున్న రోహిణీ ఆచార్య నిర్ణయించడం ప్రపంచానికి తెలిసిన తరువాత మరునాడు ఆమె భావోద్వేగానికి గురయ్యారు. దీనిపై వరుసగా ట్వీట్లు వెలువరించారు. కిడ్నీ దానం ఇవ్వడం అంటే కేవలం ఒక చిన్నమాంసం తునకని, తండ్రి కోసం తానేదైనా చేస్తానని , ఆయన ఆరోగ్యం బాగుండాలని, తిరిగి మీ అందరితో మాట్లాడేలా ప్రార్థనలు చేయాలని ఆమె ట్వీట్ల ద్వారా ప్రజలను అభ్యర్థించారు.

తన కుటుంబం తరఫున ఆమె సామాజిక మాధ్యమాన్ని చాలా తెలివిగా వినియోగించుకుంటున్నారు. 74 ఏళ్ల ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అనేక వ్యాధులతో సతమతమవుతున్నారు. మూత్రపిండాల మార్పిడి అనివార్యమని వైద్యులు సలహా ఇచ్చారు. ఇప్పుడు కిడ్నీ దానం ఇవ్వడానికి రెండో కుమార్తె రోహిణీ ఆచార్య ఆత్రుత పడుతున్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ ఢిల్లీలో తన పెద్ద కుమార్తె మీసా భారతి వద్ద ఉంటున్నారు. గత నెల సింగపూర్ వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News