Friday, November 22, 2024

అందరూ చూడాల్సిన సినిమా ‘లంబసింగి’…. రివ్యూ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: “లంబసింగి” సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి హీరోయిన్ గా నటించింది. దివికి తోడుగా భరత్ రాజ్ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి నవీన్ గాంధీ దర్శకత్వం వహించగా కాన్సెప్ట్ ఫిల్మ్ బ్యానర్ పై ఆనందర్ తన్నీరు, దర్శకుడు కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్.ఆర్.ధృవన్ ఈ మూవీకి సంగీతం అందించాడు. లంబసింగి మార్చి 15న విడుదలైంది. గతంలో కల్యాణ్ రామ్ ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ సినిమాలకు దర్శకుడిగా ఉన్నాడు.  ఈ సినిమా కథ గురించి చెబుకుందాం..

సినిమా కథ: హీరో భరత్ రాజ్ ను సినిమాలో కానిస్టేబుల్ వీరబాబుగా చూపించారు. వీరబాబు కానిస్టేబుల్ గా లంబసింగి అనే గ్రామంలో పోస్టింగ్ పడుతుంది. లంబసింగి గ్రామంలో బస్సు దిగగానే హరిత(దివి) కనిపించడంతో ఆమె అందం చూసి ప్రేమలో పడుతాడు. హరిత ఓ మాజీ నక్సలైట్ కుమార్తె అని తెలుసుకుంటాడు. మాజీ నక్సలైట్లుకు ప్రభుత్వం పునరావాసం కల్పించడంతో పోలీసులు వారిపై నిఘా పెడుతారు. మాజీ నక్సలైట్లతో ప్రతీ రోజు పోలీసులు ఇంటికి వచ్చి సంతకాలు చేయించేవారు. హరిత ఇంటికి వీరబాబు వెళ్లి ఆమె తండ్రితో సంతకం తీసుకొని వెళ్లేవాడు. అలా ఆమె ఇంటికి వెళ్లిన క్రమంలో పలుమార్లు హరితను ప్రేమలోకి దించడానికి ప్రయత్నిస్తాడు. అదే గ్రామంలో ఆమె నర్సుగా పని చేస్తుంది. ప్రాణపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని వీరబాబు ఆమె ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్తాడు. ఈ క్రమంలో ఆమెకు అతడు దగ్గర అవుతాడు. ఆమెకు తన ప్రేమ గురించి చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు. ఓ రోజు హరితకు తన ప్రేమ గురించి చెప్పగానే ఆమె తిరస్కరించడంతో నిరాశకు లోనవుతాడు. వీరబాబు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండగా నక్సలైట్లు దాడి చేసి అక్రమంగా ఆయుధాలను ఎత్తుకెళ్లుతారు. దీంతో వీరబాబుకు ఊహించన ఘటన ఎదురవుతుంది. అసలు హరిత అతడి ప్రేమను ఎందుకు తిరస్కరించింది, ఆమె గతం ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

Lambasingi movie review

విశ్లేషణ: ‘లంబసింగి’ సినిమాలో దర్శకుడు నవీన్ గాంధీ ఎంచుకున్న కథ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో సినిమా నెమ్మదిగా అనిపించిన సెకండ్ హాఫ్ లో  అద్భుతంగా ఉంటుంది. హీరోయిన్ కథను ఈ సినిమాలో చూపించిన తీరు బాగుంటుంది. ఇంటర్వెల్ వద్ద ట్విస్ట్ సినిమాకు హైలెట్ గా ఉంటుంది. సినీ ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు బోరు కొట్టకుండా నిర్మించారు. వీరబాబు, రాజు పాత్రలతో కడుపుబ్బ నవిస్తారు. క్లైమాక్స్ మాత్రం భావోద్వేగంతో తెరకెక్కించడంతో ఈ ఫీల్ ను మనసులో పెట్టుకొని ప్రేక్షకుడు సినిమా హాల్ నుంచి బయటకు వస్తాడు.

సాంకేతిక నిపుణుల పనితీరు : ఈ సినిమాలో పాటలు బాగుంటాయి, సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో ఎక్కడ కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా లంబసింగి అనే ప్రపంచంలోకి వెళ్లిపోయినట్టు ఉంటుంది. సంగీతం సినిమాను ఒక మెట్టు పైన ఉంచింది. కె బుజ్జి, ఎడిటర్ విజయ్ వర్ధన్ కావూరి తన పనిని ఈ సినిమాలో చూపించి మెప్పించగలిగారు.

హీరోయిన్ దివిని అందాలు ఒలకబోయడం కోసం ఎక్కువగా వాడారు. ఆమెలో సహజమైన నటి ఉన్నదని లంబసింగి సినిమా ద్వారా మాత్రమే తెలుస్తుంది. హరిత పాత్రలో దివి జీవించేసింది. నటుడు భరత్ కూడా వీరబాబు పాత్రలో అద్భుతంగా నటించాడు. క్లైమాక్స్ లో వీరబాబు బావోద్వేగంతో కూడిన నటన సినిమాకు హైలెట్ గా ఉంది. ఈ సినిమాలో  వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య తదితరలు నటించారు. .

చివరి పలుకు: ప్రేక్షకుడు ఏమి కోరుకుంటాడా లంబసింగి సినిమాలో దొరుకుతుంది. వీకెండ్ లో థియేటర్లలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.

రేటింగ్ : 3.5/5

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News