Thursday, January 23, 2025

విలాపాలు.. తిరుగుబాట్లు.. బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో నామినేషన్ల గడువు ఆఖరి రోజు, ఆఖరి నిమిషం వరకూ ఉత్కంఠ భరితంగా రాజకీయాలు నడిచాయి. చివరి రోజున అధికార బిఆర్‌ఎస్ మినహాయిస్తే, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో అభ్యర్థుల విషయంలో తీవ్ర గందరగోళ వాతావర ణం నెలకొన్నది. అధికార బిఆర్‌ఎస్ 119 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లో ప్రకటించిన అభ్యర్థి అబ్రహంను మార్చి విజయుడుకి టికెట్ ఇస్తే మిగిలిన ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలలో నామినేషన్ల చివరి గడువు వ రకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నా యి. బిఆర్‌ఎస్‌లో అభ్యర్థుల మార్పుపై పార్టీ అధినేత కెసిఆర్‌పై ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఒ క్క ఆలంపూర్ మినహాయిస్తే ఎక్కడ ఎన్ని ఒత్తిడు లు, తిరుగుబాట్లు వచ్చినా ఆయన మార్పులకు స సేమిరా అంటూ ముందుకు సాగారు. బిజెపి అ యితే నామినేషన్ల గడువు ముగిసే 2 గం. వరకు అభ్యర్థులను మార్చి అభ్యర్థులను, నాయకులను, కార్యకర్తలను అయోమయానికి గురి చేసింది.

విపక్ష కాంగ్రెస్ అభ్యర్థులను తేల్చడానికి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ జోక్యం చేసుకొని పార్టీలోని వైరి వర్గాలను పిలిపించుకొని అర్ధరాత్రి వరకు మంతనాలు జరపాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చివరి రోజు పటాన్‌చెరు, నారాయణఖేడ్, సూర్యాపేట అభ్యర్థులను ఉత్కంఠ భరిత వాతావరణంలో ఎంపిక చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా పటాన్‌చెరులో తొలుత నీలం మధుకు టికెట్ ఇచ్చి ఆ తర్వాత ఎఐసిసి నాయకుల జోక్యంతో కె. శ్రీనివాస గౌడ్‌కు టికెట్ మార్చారు. ఇక్కడ మాజీ ఉపముఖ్యమంత్రి రాజనరసింహ తన మాటని నెగ్గించుకొని గెలిచే అభ్యర్థి అంటూ శ్రీనివాస గౌడ్‌ను ఎంపిక చేయడం వెనుక పెద్ద తతంగమే నడిచింది. చివరి రోజున కొత్త అభ్యర్థి, పాత అభ్యర్థి నీల మ ధు నామినేషన్లు వేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. బిఫామ్ కేటాయించిన తర్వా త గాంధీ భవన్‌కు వెళ్లినా నీలం మధుకు బిఫామ్ దక్కకపోవడంతో ఆయన ఆఖరు రోజున బహుజ న సమాజ్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.

మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్‌లో కూడా చివరి వరకు ఇదే పరిస్థితి. ఇక్కడ తొలుత సురేష్ షెట్కర్‌కు టికెట్ కేటాయించారు. కానీ ఇక్కడ కూడా పెద్ద కూత్తున ఎఐసిసిపై ఒత్తిడిలు పెరిగాయి. దీంతో కార్యదర్శి వేణుగోపాల్ ఇరువర్గాలను పిలిచి ఇద్దరిలో ఒకరు ఎంఎల్‌ఎ, ఇంకొకరు ఎంపిగా పోటీ చేయాలని రాజీ ఫార్ములా సూచించారు. ఈ మేర కు సురేష్ షెట్కర్ తాను ఎంపిగా పోటీ చేస్తానని చెప్పడంతో సంజీవరెడ్డికి టికెట్ ఖరారైంది. నల్గొండ జిల్లా సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిల మధ్య టికెట్ కోసం హోరాహోరీగా పోటీ ఏర్పడింది. చివరకు ఎ ఐసిసి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరా రు చేయడంతో ఈ టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకు న్న పటేల్ రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. ఇది వీడియోలో వైరల్ అయింది. చివరకు పటేల్ రమేష్ రెడ్డి కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ వేశారు.

ఇక భారతీయ జనతా పార్టీ చివరి వరకు తాను గందరగోళానికి గురి అవుతూ అందరినీ అయోమయంలో ముంచెత్తింది. ముందుగా సంగారెడ్డిలో దేశ్‌పాండే కి టికెట్ ఇచ్చి, చివరిలో పులిమామిడి రాజుకు టికెట్ ఇచ్చింది. దీనితో నామినేషన్ వేయడానికి వెళుతూ ప్రజల సమక్షంలో దేశ్ పాండే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్‌లో హెచ్చరికలు జారీ చేశారు. అయినా బిజెపి కొత్త అభ్యర్థికే టికెట్ ఖరారు చేసింది.

కరీంనగర్ జిల్లా వేములవాడలో మరింత విచిత్రం జరిగింది. అక్కడ తొలుత ప్రకటించిన తుల ఉమ శుక్రవారం నామినేషన్ వేసింది. కొద్ది గంటలకే బిజెపి ఆఖరి నిమిషంలో ఇక్కడ వికాస్ రావుకు టికెట్ కేటాయించింది. మహిళలకు బిజెపిలో ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. బెల్లంపల్లిలో కూడా ఇదే పరిస్థితి ముందుగా ఎ శ్రీదేవిని అభ్యర్థిగా ప్రకటించి తర్వాత కె ఎమోజిని ప్రకటించారు. బిజెపి చివరి రోజున నాలుగో జాబితాలో 14 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాని చాలా మార్పులు అనూహ్యంగా చేసింది. దీనితో ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయలేని దయనీయ స్థితిలో వున్నట్టుగా పరిణామాలు రుజువు చేశాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థిగా మాజీ ఎంఎల్ జలగం వెంకట్‌రావు ఆఖరి రోజున నామినేషన్ వేశారు. ఆయన ఇప్పటివరకు బిఆర్‌ఎస్‌లో ఉన్నారు. టికెట్ రాకపోవడంతో ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు రాజకీయ వారసత్వం ఆయనకు మరోసారి త్రిముఖ పోటీలో కలిసి వస్తుందా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News