Friday, January 3, 2025

ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు భూసేకరణ

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు నిమిత్తం భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈక్రమంలోనే దుద్యాల మండలంలోని లగచర్లలో 110 ఎకరాల 32 గుంటలు, పోలేపల్లిలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్లలో రైతులు, స్థానికుల ఆందోళనల నేపథ్యంలో అంతకుముందు ఇక్కడ ఫార్మా విలేజ్ కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఇటీవల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గతంలో దుద్యాల మండలం హకీంపేట, లగచర్ల, పోలెపల్లి గ్రామాల్లో ఫార్మావిలేజ్ కోసం 1,538 ఎకరాల భూసేకరణ కోసం నోటిపిషన్ జారీ చేసిన సర్కారు ఉద్రిక్తతల నేపథ్యంలో వెనక్కి తగ్గింది.

ఫార్మా విలేజ్‌కు బదులుగా తాజాగా మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూములు సేకరించనుంది. కాలుష్యకారక ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వబోమని ఆయా గ్రామాల రైతులు విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఫార్మా విలేజ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కాలుష్యం లేని, పర్యావరణ హిత పరిశ్రమల ఏర్పాటుకే పారిశ్రామిక వాడ ఏర్పాటులో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. పరిశ్రమల ఏర్పాటు ద్వారా కరవు పీడిత ప్రాంతమైన కొడంగల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News