Monday, December 23, 2024

మానవీయకోణంలో భూసేకరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ రహదారులకు భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధన ల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా చూడాలన్నారు. రాష్ట్రంలో భారత జాతీయ రహదారు ల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలో రహదారుల ని ర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్క ర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవా రం సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవే పనులకు రాష్ట్ర ప్ర భుత్వం తరఫున అవసరమైన చర్యలు చేపట్టేందుకు, మంగళవారం జరిగిన ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారుల భేటీలో లేవనెత్తి న వినతులపై బుధవారం సచివాలయంలో సిఎం రేవంత్ ఉ న్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారుల స్థితిగతుల గురించి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సిఎం అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రీజనల్ రింగ్ రో డ్డు భూసేకరణలో పురోగతిపై ఆరా తీశారు. మంచిర్యాల, -వరంగల్, -ఖమ్మం-, విజయవాడ కారిడార్ భూసేకరణపై ఆరా తీసిన సిఎం, ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, అధికారులు ప్రత్యక్షంగా హాజరవ్వగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తు మ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు. పలువురు కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని వివరాలు సమర్పించారు.

భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతోంది..?
ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించా రు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉం డడం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములు ఇ చ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సిఎం తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారన్న వి షయా న్ని గుర్తించాలన్నారు. కలెక్టర్లు రైతులతో పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలని సిఎం రేవంత్ సూచించారు. రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ద క్షిణ భాగం, ఉత్తర భాగం వేర్వురుగా చూడొద్దని, ఆ రెం డింటికి కలిపి ఒకే నెంబర్ కేటాయించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరగా, ఆయన సూ త్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి తెలిపా రు. ఆ ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సిఎం సూచించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభు త్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఏఐల మధ్య త్రైపాక్షిక ఒ ప్పందం (ట్రైపార్టియేట్ అగ్రిమెంట్) కుదుర్చుకోవాల్సి ఉం టుందని అధికారులు సిఎంతో పేర్కొనగా వెంటనే దానిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నాం
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంలో భూ సేకరణలో ఉన్న ఆటంకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అలైన్‌మెంట్ విషయంలో పొరపడి కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారని, దాంతో హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని కలెక్టర్‌కు ముఖ్యమంత్రి సూచించారు. నాగ్‌పూర్- టు విజయవాడ కారిడార్ లో ఖమ్మం జిల్లాలో భూ సేకరణ పరిస్థితి ఏమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఖమ్మం సమీపంలోని విలువైన భూముల మీదుగా రహదారి పోతుందని, పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల తెలిపారు. తల్లాడ-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున, ప్రస్తుతం ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న జా తీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సూచిస్తున్నారని, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని, జాతీయ రహదారిగానే దాని ని కొనసాగించాలని మంత్రి తుమ్మల అభిప్రాయం వ్యక్తం చేశారు.

పెద్ద గ్రామాలున్న చోట సర్వీసు రోడ్లు నిర్మించాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి
అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ నాగ్‌పూర్- టు విజయవాడ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న రహదారిలో పెద్ద గ్రామాలున్న చోట సర్వీసు రోడ్లు నిర్మించాలని, రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన చోట్ల అండర్‌పాస్‌లు నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు సభ్యడు అనిల్ చౌదరి బదులిచ్చారు. జాతీయ రహదారుల వెంట వ్యవసాయ వాహనాలు, రైతులు వినియోగించుకునేలా గ్రావెల్ రోడ్లు నిర్మించాలన్న ప్రతిపాదన సమీక్షలో వచ్చింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు సభ్యుడు అనిల్ చౌదరి తెలిపారు. గ్రావెల్ రహదారి నిర్మించడం వలన రైతులకు ఉపయోగపడడంతో పాటు భవిష్యత్‌లో రహదారి విస్తరణకు ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ల మధ్య 12 రేడియల్ రోడ్లు నిర్మించడంతో పాటు, వాటి మధ్య పలు క్లస్టర్లు, శాటిలైట్ న్‌షిప్‌లు నిర్మించనున్నట్లు సిఎం రేవంత్‌రెడ్డి అధికారులకు వివరించారు.

సమన్వయంతో ముందుకు సాగండి
ఆర్మూర్, -జగిత్యాల-, మంచిర్యాల, విజయవాడ-, నాగ్‌పూర్ కారిడార్ రహదారులకు సంబంధించి అటవీ శాఖ భూముల బదలాయింపు సమస్య అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్, మం చిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఈ విషయంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వ యం చేసుకోవాలని సిఎం సూచించారు. ప్రభుత్వ భూములను అటవీ శాఖకు బదలాయించి అటవీ శాఖ భూములను తీసుకొని రహదారుల నిర్మాణానికి ఉన్న ఆటంకాల ను తొలగించాలని ముఖ్యమంత్రి సూచించారు. వివిధ శా ఖల పరిధిలోని యుటిలిటీస్ తొలగింపునకు సంబంధించి చెల్లింపులు వేగవంతం చేయాలని, ఏవైనా సమస్యలుంటే ఎన్‌హెచ్‌ఏఐతో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూ చించారు. హైదరాబాద్ -టు మన్నెగూడ రహదారి పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అంగీకరించారు.

రెండు నెలల్లో రోడ్డు విస్తరణ పనులు
హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణ పనులకు భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్ చౌదరిని కోరారు. రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన బదులిచ్చారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ఓఎస్డీలు శేషాద్రి, మాణిక్ రాజ్, చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసీం, మౌలిక వసతుల సలహాదారు శ్రీనివాసరాజు, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి రజాక్, పిసిసిఎఫ్ డోబ్రియల్, ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీష్, మెదక్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News