- Advertisement -
హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని, పారదర్శకత పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిపిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం భూసేకరణలో వేగం పెంచాలని కూడా ఆయన ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అలైన్ మెంట్ ఉండాలన్నారు.
ఆర్ఆర్ఆర్ కింద సంగారెడ్డి-భువనగిరి-చౌటుప్పల్ మార్గంలో భూసేకరణ దాదాపు పూర్తి కాగా, దక్షిణ భాగంలో చౌటుప్పల్-ఆమన్ గల్-షాద్ నగర్-సంగారెడ్ది పరిధిలో 189.20 కిలో మీటర్ల మార్గానికి భూసేకరణ, అలైన్ మెంట్ అంశాలపై అధికారులకు సిఎం పలు సూచనలు చేశారు. ఏవైనా సాంకేతిక సమస్యలుంటే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని అధికారలకు సూచించారు.
- Advertisement -