Sunday, March 30, 2025

భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపాలి: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలో ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపాలని సిఎం రేవంత్ రెడ్డిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయవద్దని సూచించారు. వనరుల పేరిట పర్యావరణాన్ని నాశనం చేయడం మంచిది కాదని హితువు పలికారు. హెచ్‌సియులో  400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవ వైవిధ్యంతో కూడిన ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్లా మార్చవద్దని కిషన్ రెడ్డి కోరారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News