Wednesday, January 8, 2025

ఆడుకుంటున్న పిల్లలపై నాటుబాంబులు.. నలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Land bombs on playing children.. Four arrested

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ నరేంద్రపూర్ పరిధి లోని దస్పరాలో ఆటస్థలంలో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న పిల్లలపై నాటు బాంబులు విసిరడంతో బాంబులు పేలి ఐదుగురు గాయపడ్డారు. 12-13 ఏళ్ల పిల్లలు పుట్‌బాల్ ఆడుతుండగా బాల్ ఓ మూలకు వెళ్లింది. ఒక బాలుడు అక్కడకు వెళ్లి చూడగా అక్కడ నాటుబాంబులు కనిపించాయి. ఇది తెలిసి మిగతా పిల్లలు అక్కడకు చేరడంతో నాటు బాంబులకు కాపలా ఉన్న వారు పిల్లలను అక్కడ నుంచి వెళ్లిపొమ్మని హెచ్చరించారు. పిల్లలు వెళ్లకపోవడంతో వారిపై రెండు నాటు బాంబులు విసిరారు. ఒక బాంబు గురి తప్పింది. మరోబాంబు సమీపంలో పేలింది. దీంతో ఐదుగురు పిల్లలు గాయపడ్డారు. బాంబు శబ్దం విని స్థానికులు అక్కడకు వచ్చి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయని, వారు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News