Wednesday, January 22, 2025

గ్యాంగ్‌డాంగ్‌లో కుంగిన రోడ్డు: 19 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనా దేశంలోని గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఒక్క సారిగా భూమి కుంగిపోవడంతో 19 మంది మృతి చెందారు. మీజౌ-డాబు కౌంటీ నగరాల మధ్య జాతీయ రహదారి మధ్యలో రోడ్డు కుంగిపోవడంతో 18 వాహనాలు పడిపోయాయి. వాహనాల పొగలు వెలువడడంతో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెస్యూ సిబ్బంది, పోలీసులు, ప్రభుత అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 19 మంది మృతి చెందగా మరో 49 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో వరదలు, సుడిగాలులు చోటుచేసుకోవడంతో వాతావరణ మార్పులు జరిగాయి. దీంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News