Thursday, November 14, 2024

ఫోన్ కాల్స్ తో అవినాష్ ను ఇరికించారు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంపి అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టులో ఎంపి అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో గత ప్రభుత్వం సిట్ వేసిందని, సిట్ విచారణపై పిటిషన్లతో హైకోర్టు సిబిఐకి కేసు అప్పగించిందని, కోర్టు నమ్మకాన్ని సిబిఐ నిలబెట్టుకోలేదన్నారు. అప్పటి ఎఫ్‌ఐఆర్ అంశాలనే సిబిఐ పరిగణలోకి తీసుకుందన్నారు.

Also Read: నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం…..

ఎర్రగంగిరెడ్డికి, వివేకాకు భూ తగాదాలు ఉన్నాయని, దస్తగిరి స్టేట్‌మెంట్‌తో కేసును సిబిఐ మలుపులు తిప్పిందన్నారు. వివేకా హత్య కేసులో దస్తగిరి అరెస్ట్ చాలా కీలకమైందన్నారు. 2020 నుంచి వివేకా హత్య కేసును సిబిఐ విచారిస్తుందని, ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ సర్వసాధారణమన్నారు. ఫోన్ కాల్స్ ఆధారంగా చూపి అవినాష్‌ను ఇరికించాలని చూస్తున్నారని, పలు కారణాలు చూపి అవినాష్‌ను అనుమానిస్తున్నారన్నారు. సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో 201 సెక్షన్ లేదని, మొదట లోకల్ పోలీసులు 174 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, సిబిఐ ఒక కేసు నమోదు చేసే ముందు పాత ఎఫ్‌ఐఆర్ రీ రిజిస్టర్ చేయాలని, కానీ సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా 174 సెక్షన్ లేదని అవినాష్ తరఫు లాయర్ తెలిపాడు.

సిబిఐ ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రక్రియ ఏంటని హైకోర్టు ప్రశ్నించడంతో పాటు రూ.46 లక్షలు ఎవరి నుంచి రికవరీ చేశారని హైకోర్టు అడిగింది. మున్నా లాకర్ నుంచి రికవరీ చేశామని సిబిఐ తెలిపింది. మున్నా స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారా? అని హైకోర్టు ప్రశ్నించింది. డబ్బు రికవరీ చేసిన డేట్‌ను ఛార్జ్‌షీట్‌లో పెట్టారా? అని కోర్టు అడిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News