Sunday, December 22, 2024

తేజస్వియాదవ్, మీసాభారతిలను ప్రశ్నించిన సీబీఐ, ఈడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసులో బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌ను సిబీఐ, ఆయన సోదరి మీసా భారతిని ఈడీ శనివారం ప్రశ్నించాయి. విచారణ కోసం న్యూఢిల్లీ లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేసన్ (సిబిఐ) ప్రధాన కార్యాలయానికి వచ్చినప్పుడు , తాను, తన కుటుంబం ఈ కేసులో పోరాడాలని నిర్ణయించుకున్నట్టు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ చెప్పారు.

మరోవైపు ఇదే కేసుకు సంబంధించి తేజస్వి సోదరి మీసా భారతిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం ఢిల్లీ కార్యాలయంలో ప్రశ్నించింది. ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసులో సోదరి మీసా భారితిని ప్రశ్నించేముందు సమాజ్ వాది అధినేత అఖిలేష్ యాదవ్ మీసా భారతి ఇంటికి వెళ్లారు. ప్రాంతీయ పార్టీ పరువు తీసేందుకు ఈడీ, సిబిఐ, ఆదాయం పన్ను శాఖలను బీజేపీ దుర్వినియోగం చేసిందని అఖిలేష్ అన్నారు.

భూమిఉద్యోగాల కుంభకోణం కేసులో తేజస్వియాదవ్‌ను ఈ నెలలో అరెస్టు చేసే ఆలోచన లేదని సిబిఐ న్యాయవాది జస్టిస్ దినేష్ కుమార్‌శర్మ ముందు చెప్పారు. సిబిఐ తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ తేజస్వియాదవ్‌పై వేసిన పిటిషన్‌ణు హైకోర్టు కొట్టి వేసింది. దీంతో తేజస్వి విచారణకు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News