Tuesday, January 21, 2025

భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌పై భూకబ్జా కేసు

- Advertisement -
- Advertisement -

భువనగిరి కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో భూకబ్జా కేసు నమోదైంది. తుర్కయాంజల్ పరిధిలో కిరణ్ కుమార్ రెడ్డి భూమిని కబ్జా చేశారంటూ కంచర్ల రాధిక అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డిపై సెక్షన్ 447, 427, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ సర్వే నెంబర్ 500, 501లో 200 గజాల ప్లాట్ కబ్జా చేశారంటూ రాధిక అనే మహిళ ఫిర్యాదు చేశారు.

2003లోనే కిరణ్ కుమార్ రెడ్డి భూమి కొన్నట్లుగా డాక్యుమెంట్ ఉందని, అదే భూమి రాధిక అనే మహిళ పేరు మీద 2015లో డాక్యుమెంట్ అయినట్లుగా ఉందని సిఐ వివరణ ఇచ్చారు. ఈ కేసుపై ఇద్దరి డాక్యుమెంట్స్ తీసుకొని పూర్తి విచారణ జరుపుతున్నామని ఇందులో డబుల్ రిజిస్ట్రేషన్ జరిగాయా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సిఐ రాఘవేంద్ర రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News