Monday, January 20, 2025

భూబకాసురులకు మనీకొండ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ నార్సింగి: డబ్బు ఉంటే చాలు ఏదైనా సాదించవచ్చునని నిరూపించారు గండిపేట మండలంలోని మణికొండ మున్సిపాలిటీలో భూబకాసురులు. ఏకంగా 500 కోట్ల రూపాయల కు పైగా విలువ చేసే 5 ఎకరాల ప్రభుత్వ భూమి ని ధరణి వెబ్‌సైట్‌లో లొసుగులను అడ్డుపెట్టుకుని అదే శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు సైతం ఎరవేసి 3కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుని ఆ స్థలం సర్వేనంబరు బ్లాక్ లిస్టులో ఉన్నప్పటికీ ధరణి పోర్టల్ ద్వారా సునాయాసంగా పట్టా పాసు బుక్కులు సైతం సృష్టించారు. ఎన్నికల హడావిడిలో జిల్లా కలెక్టర్లు బిజీగా ఉన్న సమయంలో అదనుచూసి ఇద్దరు ఉద్యోగులు కలెక్టర్ల సంతకాలతో పా సు బుక్కులు జారీ చేశారు. గతంలో స్థానిక గండిపేట తహసీల్దార్ దృష్టికి రావటంతో సదరు స్థలా న్ని పరిశీలించి అది ప్రభుత్వ భూమి అని తేల్చి సంబంధితపై అధికారులు జిల్లా కలెక్టరుకు నివేదికను అందించి,

ఆ స్థలం ప్రభుత్వ స్థలమని అందు లో సూచిక బోర్డు ఏర్పాటు చేయించారు. కాని ఇ ద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ స్థలంలోని బోర్డును తీసివేసి ఆ స్థలాన్ని వారి పేర్లపై రిజిస్ట్రేషన్‌తోపాటు పట్టా పాసు బుక్కులు సైతం జారీ చే యించుకోవటంతో సమాచారం తెలుసుకుని కం గుతిన్న తహసీల్దార్ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు విచారణలో భాగంగా ఇద్దరు ధరణి ఉద్యోగులతో పాటు 8 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారని, దీనిలో ఉన్నతాధికారుల పాత్ర ఏ మేరకు ఉందన్న కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారని స మాచారం. అంతేకాకుండా ఆ స్థలం తమదని పూ స ప్రహాద్ల్ , పూస రవీందర్ అనే వ్యక్తులు హై కో ర్టులో కేసు నంబరు డబ్లుపి.13290, తేదీ 09–/05-/2024 రోజు పిటిషన్ దాఖలు చేసినట్టుగా ఆ స్థలంలో బోర్డుని ఏర్పాటు చేశారు. కాని కోర్టు వివాదంలో ఉన్న స్థలాలపై కూడా పట్టా పాసు బుక్కులు జారీ అవ్వటం, ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న ఉద్యోగుల పనితీరు ఏ విధంగా ఉన్నదో ఊహించుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News