Thursday, January 23, 2025

అధికారం అడ్డుపెట్టుకుని నేతల భూ కబ్జాలు

- Advertisement -
- Advertisement -

అక్రమార్కులకు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పిలుపు

హైదరాబాద్ : రాష్ట్రంలో కొంతమంది నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలు,ఇసుక అక్రమ రవాణ,కాంట్రాక్టుల్లో కమీషన్లకు పాల్పడుతున్న నేతలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా పలు గ్రామాల్లో ప్రచారం చేపట్టి అక్రమాలకు పాల్పడే నాయకులపై విమర్శలు చేశారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే నియోజకవర్గంలో అరాచకాలు కొనసాగిస్తున్నారని రామునిపల్లిలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి ట్రినిటీ మెడికల్ కాలేజీ కట్టడాన్ని అడ్డుకున్నందుకు స్థానిక సర్పంచ్ ను ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అండతో మానేరులో నేతలు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారం అడ్డంపెట్టుకొని నియోజకవర్గంలో వేలాది ఎకరాల అసైండ్ భూములను ఆక్రమించారని, రాష్ట్రంలో వేలకోట్ల కాంట్రాక్టులన్నీ ఆధిపత్య వర్గాలకే దక్కుతున్నాయన్నారు.

సుప్రీంకోర్టు,హైకోర్టు న్యాయమూర్తుల్లో 75 శాతం న్యాయమూర్తులు అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారన్నారు. మణిపూర్ మహిళలపై దాడులు జరుగుతున్న ప్రధాని మౌనం వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ స్థలాలు,సీలింగ్ భూములల్లో ఇండ్లు కట్టుకున్న పేదలకు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ నోటీసులు జరీ చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు నామమాత్రపు రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ణయించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. యాత్రలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దాసరి హనుమయ్య, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి దాసరి ఉష, జిల్లా అధ్యక్షులు గొట్టే రాజు, ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్ జోనల్,నియోజకవర్గం అధ్యక్షులు బొంకురి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News