Wednesday, January 22, 2025

లంకభూముల రైతన్నలకు సంపూర్ణ హక్కులు: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: లంకభూముల రైతన్నలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. నూజివీడులో సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. అసైన్డ్, లంక భూముల పట్టాలను సిఎం జగన్ పంపిణీ చేసిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. కొత్తగా అసైన్డ్ భూములకు హక్కు కల్పించామని, పేదవాడిని ఆప్యాయంగా పలకరిస్తే పెత్తందారులకు నచ్చడంలేదని, తన పిలుపులోనూ, తన మనసులోనే కాదు 53 నెలల పాలనలో పేదలపక్షాన నిలబడ్డానన్నారు.

వందేళ్ల తరువాత మన ప్రభుత్వంలో భూముల రీసర్వే చేపట్టామని, 15600కు పైగా రెవెన్యూ గ్రామాల్లో భూములు రీసర్వే జరుగుతుందని వివరించారు. 45 వేలకు పైగా సరిహద్దు తగాదాలను పరిష్కరించామని, నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే ఇప్పటికే పూర్తయిందని, నాలుగు వేల గ్రామాల్లో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించామని జగన్ వివరించారు. 15 వేలకు మందికి పైగా సర్వేయర్లు భూములను రీసర్వే చేస్తున్నారని దుయ్యబట్టారు. 20 ఏళ్లకు పైగా అసైన్డ్ భూములు సాగు చేస్తున్న రైతులకు సంపూర్ణ భూహక్కులు కల్పిస్తుండడంతో 15.21 లక్ష మంది రైతులకు మేలు జరిగిందని జగన్ స్పష్టం చేశారు. పేత్తందారీ పోకడల మీద పేదల ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని జగన్ ప్రశంసించారు.

మొత్తం 35 లక్షల 44 వేల 866 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఎపి వ్యాప్తంగా 20,24,709 మంది పేద రైతులకు లబ్ధి చేకూరనుంది. 27.41 లక్షల ఎకరాలపై యాజమాన్య హక్కులు రానున్నాయి. నిరుపేదలకు కొత్తగా మరో 46 వేల ఎకరాలను పంపిణీ చేశారు. లంక భూములకు అసైన్డ్ పట్టాలు ఇచ్చారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాలు కేటాయించారు. సర్వీస్ ఈనాం, చుక్కలు షరతులు గల పట్టా భూములపై ఆంక్షలు తొలగించారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News